Tuesday 15 April 2014

వనిత కాదు అనిత (హాస్య గుళిక)


నేను 1992 లో తెలుగు పండిత శిక్షణకై ఆంధ్ర సారస్వత పరిషత్తు చేరడం వలన నాకు మా మిత్రులకు సాహిత్యంపై అభిరుచి పెరిగి వీలైనంత వరకూ తరగతి గదిలో కాలి సమయం అంటూ లభిస్తే పద్యాలతో, చతురోక్తులతో, హాస్య కథలు చెపుతూ సమయం గడిపే వాళ్ళం. ఆలా ఒక రోజు ఒకావిడ చిన్న నాని (కవిత) చెప్పి వెల్లిపోతున్నది. అది మా బృందంలో ఉన్న ఒక సభ్యుడికి వినపడక లెదా అర్థం కాక ఆవిడని మల్లి అడిగి తెలుసుకొనుటకై నన్ను పిలవమని చెప్పాడు. 

నేను ఆవిడను ఏమండి..ఏమండి..అని రెండు సార్లు పిలిచిననూ వినిపించుకోకపోవడం వల్ల మా మిత్రుడితో చతురోక్తిగా ఆ "వనిత గారు వినిపించుకోవటం లేదు" అని చెప్తుండగా పరధ్యానంలో ఉన్న ఆవిడ చెవిలో వనిత పదం వినబడగా ఆవిడ తన పేరు అడుగుతున్నారు ఆనుకొని నా పేరు "వనిత కాదండీ...అనిత" అని చెప్పింది. 

ఆ మాట విన్న మా మిత్రుడు, మిగతా బృంద సభ్యులందరం నవ్వుకున్నాం. ఆప్పటి నుండి ఆవిడని మేమందరం "వనిత కాని అనిత" అని ఆట పట్టించెవాల్లం. మా నవ్వుకోవడమూ ఆవిడకూ ఇష్టం లేక అడిగినది. అప్పుడు నేను వనిత అను పదం స్త్రీని పిలుచుటకై ఉపయోగించితిని అని చెప్పితిని. అప్పుడు ఆవిడ కూడా మా బృందంలో కలిసిపోయి నవ్వుకున్నది. ఈ విధంగా మేము సాహిత్యంపై అవగహనను పెంచుకొని శిక్షణను ముగించుకొంటిమి. ఇప్పటికి ఆ సన్నివేషం గుర్థొచ్చినప్పుడల్లా నవ్వుకొంటాం.

సోమ రాజేష్.

No comments:

Post a Comment